Chandrababu: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు...! 8 d ago
AP: అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. జమిలి అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఆయన అన్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని తెలిపారు. జమిలిపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతుందని విమర్శించారు. వైసీపీ చేసే పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.